తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. రెండో శనివారం సెలవు దినం సందర్భంగా... వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం.. గోవిందనామస్మరణతో మార్మోగింది. ఏడు ప్రదక్షిణలు చేసేందుకు వచ్చిన భక్తులతో క్యూలైన్లు నిండిపోయాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు.
గోవింద నామస్మరణతో మార్మోగిన కోనసీమ తిరుపతి - తూర్పుగోదావరి జిల్లా వాడపల్లి శ్రీవారు.
కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పు గోదావరి జిల్లా వాడపల్లి పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. ఆలయం చూట్టూ ప్రదక్షిణలు చేసేందుకు భక్తులు గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉన్నారు.

గోవింద నామస్మరణతో మార్మోగిన కోనసీమ తిరుపతి
గోవింద నామస్మరణతో మార్మోగిన కోనసీమ తిరుపతి
ఇదీ చదవండి:
రాజమహేంద్రవరంలో దిశ పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించిన సీఎం