తూర్పు గోదావరి జిల్లా వై.రామవరం మండలం కె. ఎర్రగొండ వీఆర్వో చుండం బాపిరాజు(45) కరోనా సోకి మరణించాడు. రంపచోడవరంలోని దేవర మడుగుల గ్రామానికి చెందిన రాజు వారం రోజులుగా జ్వరంతో బాధ పడుతున్నారు. వైరస్ పరీక్ష నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. వైద్యం కోసం రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ మరణించినట్లు కుటుంబసభ్యులు చెప్పారు. ఏజెన్సీ రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులు పొదిలి వెంకటేశ్వర రావు, మిర్తివాడ గణపతి రెడ్డి, జిలాని, పాల్ బాబు, రవిచంద్ర ప్రసాద్ తదితరులు మృతుని కుటుంబానికి సానుభూతి తెలిపారు.
కరోనాతో కె.ఎర్రగొండ వీఆర్వో మృతి - covid deaths in east godavari district
తూర్పుగోదావరి జిల్లా కె.ఎర్రగొండ వీఆర్వో కరోనాతో మృతి చెందారు. వైద్యం కోసం ఆస్పత్రిలో చేరిన అతను చికిత్స పొందుతూ మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
vro died