తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో అక్టోబరు 1 నుంచి ఆన్లైన్లో సత్యదేవుని వ్రతం ప్రారంభించడానికి అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. దేవస్థానం ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టూడియోలో అమ్మవారు, పరమేశ్వరుల విగ్రహం ఏర్పాటు చేశారు. స్టూడియోలో దేవస్థానం పురోహితులు వ్రతపూజలు చేసి... యూట్యూబులో అనుసంధానం చేయనున్నారు. ఆన్లైన్ ద్వారా రుసుము చెల్లించే భక్తులకు ఆలయ అధికారులు యూట్యూబ్ లింకు పంపిస్తారు. భక్తులు ఆన్లైన్లో స్వామి వారి వ్రతం వీక్షించే అవకాశంతో పాటు పురోహితుడు చెప్పే వ్రత పూజ ఇంట్లోనే చేసుకునే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ వ్రతానికి రూ. 1,116 రుసుము నిర్ణయించామని తెలిపారు. పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసి అక్టోబర్ 1 నుంచి ఆన్లైన్లో వ్రతాలు ప్రారంభించనున్నామని ఈవో త్రినాథరావు తెలిపారు.
అక్టోబరు 1 నుంచి ఆన్లైన్లో అన్నవరం సత్యదేవుని వ్రతం - అన్నవరంలో సత్యదేవుని వ్రత పూజలు
తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో అక్టోబరు 1 నుంచి ఆన్లైన్లో సత్యదేవుని వ్రత పూజలు చేయనున్నారు. ఆన్లైన్లో రుసుము చెల్లించినవారికి యూట్యూబ్ లింక్‌ను పంపించనున్నారు.
అన్నవరంలో అక్టోబరు 1 నుంచి ఆన్లైన్లో సత్యదేవుని వ్రత పూజలు