తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి మండలం ఎండపల్లి గ్రామంలో కరోనా కారణంగా ఓ వ్యక్తి మృతి చెందాడు. అతడి కుటుంబ సభ్యులకు సైతం కరోనా ఉండటంతో అంత్యక్రియలు ప్రశ్నార్థకంగా మారాయి.
ఈ క్రమంలో అతనికి అంత్యక్రియలు నిర్వహించడానికి ఎవ్వరూ కూడా ముందుకు రాలేదు. చివరికి గ్రామ వాలంటీర్లు రవి, శివ కామేశ్వర్రావు, నాగేంద్ర, మరో వ్యక్తి బుజ్జి... ఆ మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశారు.