East Godavari District News: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం బొర్రంపాలెంలో సామాజిక పింఛన్ల డబ్బును ఇంటి పన్నుగా కట్టించుకున్న ఘటన వెలుగు చూసింది. గ్రామ వాలంటీర్లు.. మంగళవారం వృద్ధాప్య పింఛన్లు పంపిణీ చేశారు. అయితే కొందరు పింఛనుదారులు ఇంటి పన్నులు చెల్లించాల్సి ఉందని.. వారి పన్నుకు సంబంధించిన సొమ్మును పింఛనులో మినహాయించుకుని మిగతా డబ్బులు చెల్లించారు. మరికొందరిని పన్ను కట్టేందుకు సచివాలయం వద్దకు రమ్మని వాలంటీరు చెప్పినట్లు సమాచారం. అయితే ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు చెప్పేందుకు లబ్ధిదారులు వెనకాడుతున్నారు.
వాలంటీర్ల నిర్వాకం.. సామాజిక పింఛన్ నుంచి ఇంటిపన్ను వసూలు..! - Volunteers collected pension money for house tax in east godavari
Collected Pension Money to House Tax: రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా అందించే సామాజిక పింఛన్ డబ్బును ఇంటి పన్నుగా వసూలు చేశారు వాలంటీర్లు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం బొర్రంపాలెంలో వెలుగులోకి వచ్చింది.
![వాలంటీర్ల నిర్వాకం.. సామాజిక పింఛన్ నుంచి ఇంటిపన్ను వసూలు..! collect Pension for House tax in borrampalem](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14348257-8-14348257-1643783451505.jpg)
పింఛన్ డబ్బును ఇంటి ట్యాక్స్కి వసూలు చేసిన వాలంటీర్ల