ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Volunteer rapes minor: బాలికపై గ్రామ వాలంటీరు అత్యాచారం.. పోక్సో కింద కేసు నమోదు - బాలికపై గ్రామ వాలంటీరు అత్యాచారం

Volunteer rapes minor: గ్రామ వాలంటీరుగా పనిచేస్తూ ఇళ్లకు వెళ్తున్న క్రమంలో ఓ బాలికతో పరిచయం పెంచుకున్న యువకుడు.. అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంటింటికి తిరుగుతున్న క్రమంలో.. వాలంటీర్ సతీష్ ఆ బాలికతో పరిచయం పెంచుకుని ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ అఘాయిత్యానికి తెగబడ్డాడు. నిందితుడిపై పోలీసులు పోక్సో కింద కేసు నమోదు చేశారు.

Volunteer rapes minor in seethanagaram at east godavari
బాలికపై గ్రామ వాలంటీరు అత్యాచారం

By

Published : Apr 18, 2022, 9:48 AM IST

Volunteer rapes minor: తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం బొబ్బిల్లంకకు చెందిన గ్రామవాలంటీరు బూసి సతీష్‌ (23) అదే గ్రామానికి చెందిన బాలికపై అత్యాచారం చేశాడు. ఇంటింటికి తిరుగుతున్న క్రమంలో ఆ బాలికతో పరిచయం పెంచుకుని ఇంట్లో ఎవరూ లేని సమయంలో నమ్మించి అఘాయిత్యానికి తెగబడ్డాడు. విషయాన్ని బయటకు చెప్పొద్దని బెదిరించాడు. ఆదివారం బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సతీష్‌పై పోక్సో కింద కేసు నమోదు చేశారు. బాలికను చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్సై కె.శుభశేఖర్‌ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details