Volunteer Attacked a Boy for not Bringing Cigarettes: రాష్ట్రంలో వాలంటీర్ల దారుణాలుపెరుగుతున్నాయే గాని తగ్గడం లేదు.. వాలంటీర్ వ్యవస్థతో దేశం అంతా ఏపీ వైపు చూస్తుందని సీఎం జగన్ గొప్పలు చెప్పుకుంటున్నారు. కాని వారి అరాచకాలు మాత్రం రోజు రోజుకి పెచ్చుమీరు తున్నాయి. తాజాగా తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం కణుపూరు గ్రామంలో జరిగిన ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. కణువూరు గ్రామంలోని కల్యాణం సతీష్ వాలంటీరుగా పని చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఏడో తరగతి విద్యార్థి తల్లోజు శశిధర్‌ని ఈ నెల 11న రోడ్డుపై వెళ్తుండగా ఆపి.. సిగరెట్లు తెచ్చి పెట్టమని కోరాడు. బాలుడు వినకుండా వెళ్లిపోయాడు.
Jagananna Houses Fraud: జగనన్న ఇళ్ల పేరుతో వాలంటీర్ మోసం.. బాధితుల ఆందోళన
Taken to Terrace and Attacked:దీన్ని మనసులో పెట్టుకున్న వాలంటీర్‌సతీష్.. అదే రోజు రాత్రి బుర్రకథ కార్యక్రమం దగ్గర ఉన్న శశిధర్‌ను, అక్కడే ఉన్న మరో విద్యార్థిని సరదాగా తిరిగి వద్దామంటూ చెప్పి ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని సామిల్లు దగ్గర ఉన్న డాబాపైకి తీసుకువెళ్లాడు. అక్కడ అప్పటికే మద్యం సీసాలు, బజ్జీలు ఉన్నాయి. బజ్జీలు తినిమని వాళ్లుకు ఇచ్చాడు. ఆపై 'సిగరెట్టు తెమ్మంటే ఎందుకు తీసుకురాలేదు? నేనవరో తెలుసా' అంటూ శశిధర్‌ను చావబాదాడు. కొట్టద్దంటూ మరో బాలుడు ప్రాధేయపడగా.. ఇద్దర్ని కలిపి కొట్టాడు. ఇద్దరు తప్పించుకుంటూ కిందకి వెళ్లిపోతుండగా.. శశిధర్‌ను వెనుక నుంచి గట్టిగా తన్నడంతో డాబా పైనుంచి రోడ్డుపై పడ్డాడు. ఇక్కడ జరిగిన విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానంటూ వారిద్దరినీ బెదిరించాడు.
Volunteer Withdraw Money From Woman Account: మహిళ ఖాతాలో నగదు మాయం.. ఏలూరు జిల్లాలో వాలంటీర్ నిర్వాకం
Police Registered a Case Against Volunteer and Arrested:తరువాత శశిధర్‌ని తానే బైక్‌పై ఎక్కించుకుని ఇంటి వద్ద దింపాడు. గుడిమెట్లు ఎక్కుతుండగా కింద పడితే తీసుకువచ్చానని అతడి తల్లిని నమ్మించాడు. తీవ్రగాయాలైన బాలుడ్ని తల్లిదండ్రులు రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. అప్పటికీ గాయాలు నయం కాకపోవడంతో తరువాత ఆసుపత్రికి తీసుకువెళ్లగా అక్కడ శస్త్రచికిత్స నిర్వహించారు. బాలుడు శశిధర్ గుడి మెట్ల మీద పడలేదని ఆ నోటా ఈ నోటా విన్న అతని తండ్రి వీరబాబు.. అనుమానంతో ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. అక్కడ తన కుమారుడి చెప్పు కనిపించడంతో శశిధర్‌ని ఆరాతీశాడు. ఘటన జరిగిన సమయంలో ఉన్న మరో బాలుడ్ని, శశిధర్‌ను గట్టిగా నిలదీయడంతో వాలంటీర్ సతీష్ చేసిన నిర్వాకం బయటపడింది.
Volunteer Cheating with Rubber Fingerprint: వాలంటీర్ నిర్వాకం.. బెంగళూరులో ఉంటూ.. ఊర్లో పింఛన్లు పంపిణీ.. ఇదెలా..!
Registration of Case Against Volunteer:న్యాయం చేయాలని బాలుడి తల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి మొరపెట్టుకుంది. బాలుడి కాలు, చేతికి తీవ్ర గాయాలయ్యాయని, ఒక కాలికి, చేతికి శస్త్రచికిత్స చేయాల్సి వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం బాలుడు లేవలేని స్థితిలో ఉన్నాడని.. ఆరునెలలు మంచంపైనే ఉండి చికిత్స తీసుకోవాలని వైద్యులు తెలిపారని వాపోయారు. వాలంటీర్ గంజాయి, మద్యం తాగుతూ జులాయిగా తిరుగుతుంటాడని తన బిడ్డని చిత్రహింసలు పెట్టి కొట్టాడని తల్లి ఆవేదన చెందారు. వాలంటీర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఘటనపై ఆరా తీసిన ట్రైనీ ఐపీఎస్ పంకజ్‌కుమార్ మీనా.. వాలంటీర్ కల్యాణం సతీష్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు.
Volunteer Attacked on Boy వాలంటీర్ ఘాతుకం.. సిగరెట్లు తీసుకురాలేదని బాలుడ్ని డాబాపై నుంచి తోశాడు!