తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం మానేపల్లిలోని వైనతేయ గోదావరి నది తీర లంక భూముల నుంచి ఇష్టానుసారంగా మట్టిని తరలిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ రహదారి పనుల పేరుతో అనుమతులు తీసుకుని లంక మట్టిని దారి మళ్లిస్తున్నారంటూ.. ఈరోజు సాయంత్రం లారీలను స్థానికులు అడ్డుకున్నారు. అధిక లోడుతో లారీలు తిరగడంతో ఏటిగట్టు అధ్వానంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి:టపాసుల దుకాణంలో అగ్ని ప్రమాదం- ముగ్గురు మృతి