ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మా ఊరి గుడిలో ఇప్పుడే దర్శనాలు వద్దు' - వాడపల్లిలో గ్రామస్థుల ఆందోళన వార్తలు

లాక్​డౌన్ సడలింపులతో రాష్ట్రంలోని దేవాలయాలన్నీ తెరుచుకున్నాయి. అయితే తమ గ్రామంలోని గుడిలో దర్శనాలకు అనుమతి ఇవ్వొద్దంటూ.. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామస్థులు ఆందోళన చేశారు.

villagers protest in vaadapalli east godavari district
వాడపల్లిలో గ్రామస్థుల ఆందోళన

By

Published : Jun 8, 2020, 1:53 PM IST

కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి వేంకటేశ్వరస్వామి దేవాలయానికి భక్తులను అనుమతించవద్దని వాడపల్లి గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. పేరుపొందిన గుడి కనుక ఎక్కడెక్కడినుంచో ప్రజలు వస్తుంటారని.. ఈ క్రమంలో వైరస్ వ్యాప్తి అధికమవుతుందంటూ వారు భయాందోళన వ్యక్తం చేశారు. గ్రామం మధ్యలో ఆలయం ఉండడం వలన మరిన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని.. ఇందుకోసం మరికొన్ని రోజులు దర్శనాలు నిలిపివేయాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details