ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జనావాస ప్రాంతాల్లో ఆక్వా సాగును అడ్డుకున్న గ్రామస్థులు. - ఈటీవీ భారత్​ తాజా వార్తలు

తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరంలోని అయినాపురం పెద్ద పేటలో జనావాస ప్రాంతాల్లో చేపల రొయ్యల చెరువుల తవ్వకాలను స్థానిక ప్రజలు అడ్డుకున్నారు. చెరువుల వల్ల తాగునీరు కాలుష్యంతో పాటు, రోగులబారిన పడతామని, చెరువులకు అనుమతులు ఇవ్వద్దని రెవెన్యూ అధికారులకు విజ్ఞప్తి చేశారు.

Villagers obstructing aquaculture in east godavari
జనావాస ప్రాంతాల్లో ఆక్వా సాగును అడ్డుకున్న గ్రామస్థులు.

By

Published : Jul 24, 2020, 4:52 PM IST

తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం అయినాపురం పెద్దపేటలోని జనావాస ప్రాంతాల్లో చేపల,రొయ్యెల చెరువుల తవ్వకాలను స్థానికులు అడ్డుకున్నారు. వరి, కొబ్బిరి తోటలను... ఆక్వాసాగుకు ఉపయోగించేందుకు రైతు చేస్తున్న ప్రయత్నాన్ని గ్రామస్థులు అడ్డుకుని మండల అధికారికి ఫిర్యాదు చేశారు. చెరువుల వల్ల తాగునీరు కాలుష్యంతో పాటు, మేమంతా రోగులబారిన పడతామని గ్రామస్థులు వాపోయారు. చెరువులకు అనుమతి ఇవ్వద్దని అధికారులను వేడుకున్నారు.

ఐ పోలవరం మండలం గుత్తెనదీవిలో రైతులకు చెందిన వ్యవసాయ భూముల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని స్థానిక రైతులు అడ్డుకున్నారు. పంటబోదెలు, చేలు గట్లను పూడ్చివేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీని కారణంగా ఉన్న కొద్దిపాటి భూమినీ కోల్పోతున్నామని, వెంటనే పనులు నిలిపివేయాలని రెవెన్యూ అధికారులను కోరారు.

ఇవీ చూడండి:'వ్యాధి సోకిన వారు 10 రోజులు కరోనా దీక్ష చేస్తే వైరస్ జయించొచ్చు'

ABOUT THE AUTHOR

...view details