తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం గెద్దాడలో స్థానికులు 216 జాతీయ రహదారి నిర్మాణం పనులను అడ్డుకున్నారు. స్థానిక సోమేశ్వరస్వామి దేవాలయ భూమి వ్యవహారం కోర్టు పరిధిలో ఉండగా రహదారి పనులను ఏ విధంగా చేపడతారని గ్రామస్థులు.. అధికారులను ప్రశ్నించారు. ఆలయానికి భూమి చూపించాలని డిమాండ్ చేశారు. రహదారి పనులు జరుగుతున్న చోట పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు.
గెద్దాడలో జాతీయ రహదారి నిర్మాణ పనులను అడ్డుకున్న గ్రామస్థులు - Villagers obstruct national highway construction work in Geddada
తూర్పు గోదావరి జిల్లా గెద్దాడలో గ్రామస్థులు జాతీయ రహదారి నిర్మాణ పనులను అడ్డుకున్నారు. సోమేశ్వరస్వామి దేవాలయ భూమి వ్యవహారం కోర్టుల పరిధిలో ఉండగా.. రహదారి పనులెలా చేపడతారని అధికారులను ప్రశ్నించారు.
గెద్దాడలో రహదారి పనుల అడ్డగింత