తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు ఆధ్వర్యంలో గ్రామ వాలంటీర్లు తనిఖీలు చేశారు. 120 లీటర్ల నాటు సారాను పట్టుకున్నారు. సారా విక్రయదారులను ఎన్నిసార్లు హెచ్చరించినా ... విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయన్నారు.
ఇలాంటి చర్యలు సహించేది లేదని.. వాలంటీర్లు, గ్రామ యువతతో కలిపి ప్రతిరోజు దాడులు నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో శరకణం పెదకాపు, పొలిమేరు గోవింద్, పోలారావు, బొడ్డెటి గణపతి , వాలంటీర్లు పాల్గొన్నారు.