ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొబ్బరి రైతులకు పండుగ తెచ్చిన లాభం - గోదావరి జిల్లాలోని కొబ్బరి రైతులు

దసరా వేడుక గోదావరి జిల్లాల్లోని కొబ్బరి రైతులకు లాభం తెచ్చిపెట్టింది . పండుగ సంద్భంగా కొబ్బరికాయల ధరలు అమాంతం పెరిగాయి. భారీగా కురిసిన వర్షాలకు కాయ దింపుక పోవటం కూడా ధరల పెరిగుదలకు కారణం అని పలువురు వర్తకులు తెలిపారు.

profit to the coconut farmers
కొబ్బరి రైతులకు పండుగ తెచ్చిన లాభం

By

Published : Oct 25, 2020, 2:24 PM IST

వైభవంగా జరుగుతున్న విజయదశమి గోదావరి జిల్లాలోని కొబ్బరి రైతులకు లాభం తెచ్చిపెట్టింది. కొబ్బరికాయల ధరలు అమాంతం పెరిగాయి. ఇటీవల కురిసిన భారీవర్షాలకు కాయ దింపుళ్లు తీయలేదు. దీంతో తగినన్ని కొబ్బరికాయలు మార్కెట్‌కు రాలేదు. ఇది ధరలు పెరిగేందుకు దోహద పడిందని పలువురు వర్తకులు చెబుతున్నారు. మరోవైపు తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోనూ ఉత్పత్తి తగ్గటంతో ఉత్తరాది రాష్ట్రాల వ్యాపారులు మన రాష్ట్రం నుంచే కొబ్బరికాయలను కొనుగోలు చేసేందుకు మక్కువ చూపారు.

20 రోజుల కిందట వరకు వెయ్యి కాయలు రూ.11,000 పలకగా.. ప్రస్తుతం రూ.13,000 లకు ఎగబాకింది. ఈ పండుగ సీజన్‌లో గోదావరి జిల్లాల నుంచి రోజుకు 80 నుంచి 100 లారీల కొబ్బరికాయలు ఎగుమతులు జరిగాయి. వెయ్యి కొబ్బరికాయలకు రూ.2 వేలు ధర పెరిగింది. మార్కెట్‌లో ఇది ఓ రికార్డుగా వ్యాపారులు విశ్లేషిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details