ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తూర్పుగోదావరి జిల్లాలో అధికారుల అప్రమత్తం - Quarantine center in yanam

తూర్పుగోదావరి జిల్లాలో మూడు కరోనా కేసులు నమోదు అవడం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. పాజిటివ్ వచ్చిన ముగ్గురి కుటుంబీకులను క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. కేంద్ర పాలిత ప్రాంతం యానాం క్వారంటైన్ కేంద్రంలోని ఓ యువజంట పారిపోగా ..అధికారులు వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. తిరిగి క్వారంటైన్ కు తరలించారు.

Vigilant officers in East Godavari for corona
తూర్పుగోదావరిలో అప్రమత్తమైన అధికారులు

By

Published : Mar 31, 2020, 1:06 AM IST

తూర్పుగోదావరిలో అప్రమత్తమైన అధికారులు

తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ వచ్చిన వ్యక్తుల కుటుంబీకులను అధికారులు క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. పి.గన్నవరంలో ముందస్తుగానే 50 పడకలతో క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ మృత్యుంజయరావు వెల్లడించారు. ప్రత్తిపాడు మండలంలో 40 మందిని అన్నవరంలో ఏర్పాటుచేసిన క్వారంటైన్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. గత రాత్రి కాకినాడలో కరోనా పాజిటివ్‌ నమోదైన వ్యక్తి.. వారం క్రితం ప్రత్తిపాడు మండలం ఒమ్మంగిలో తన సామాజిక వర్గానికి చెందినవారితో కలిసి ప్రత్యేక ప్రార్ధనలు చేశాడు. అతనికి కరోనా పాజిటివ్‌ నిర్ధరణ కాగా.. ముందు జాగ్రత్త చర్యగా ఒమ్మంగి గ్రామానికి చెందిన 30 మందిని, చుట్టు పక్కల గ్రామాలు వాకపల్లి, శరభవరం, ఉత్తరకంచి, ప్రత్తిపాడు రాయవరం గ్రామాలకు చెందిన మరో 10 మందిని క్వారంటైన్‌కు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఎలాంటి వ్యాధి లక్షణాలు కనిపించకున్నా. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు, వైద్య సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

కేంద్ర పాలిత యానాంకు.. గతవారం హైదరాబాద్ నుంచి వచ్చిన కాజులూరు మండలం పేకేరు గ్రామానికి చెందిన యువజంటకు పరీక్షలు నిర్వహించారు. 14 రోజులు యానాంలోని అతిథి గృహంలో ఉండేలా ఏర్పాటు చేశారు. ఈ జంట రాత్రి సమయంలో బయటకు వచ్చి వారి స్వగ్రామం పారిపోయారు. ఎట్టకేలకు వారిని గుర్తించి తిరిగి తీసుకొచ్చి యానాం ఎస్పీ భక్తవత్సలం కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇంకోసారి ఇలా ప్రవర్తిస్తే.. క్రిమినల్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.

ఇదీచూడండి.కాతేరులో ఒకరికి కరోనా నిర్ధరణ... ఆంక్షలు కఠినం

ABOUT THE AUTHOR

...view details