తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలోని ఓ విత్తనాల దుకాణంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. విత్తనాల దుకాణంలో అమ్మకాలు, నిల్వలపై తనిఖీలు చేసేందుకు వచ్చామని విజిలెన్స్ డీఎస్పీ ముత్యాల నాయుడు తెలిపారు. దుకాణ యజమాని కుటుంబ సభ్యులకు కరోనా వచ్చినందున షాపులో ఇతర వ్యక్తులు ఉన్నారని చెప్పారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన రికార్డులను స్థానిక వ్యవసాయ అధికారిణి మీనాకు అప్పగించామన్నారు. ఆమె దుకాణానికి షోకాజ్ నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. దుకాణ యజమాని అందుబాటులోకి వచ్చిన తర్వాత రికార్డులు పరిశీలించి తేడాలు ఏమైనా ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు.
విత్తనాల దుకాణంలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు - తూర్పుగోదావరి జిల్లా తాజావార్తలు
రావులపాలెంలోని ఓ విత్తన దుకాణంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. దుకాణ యజమాని కుటుంబ సభ్యులకు కరోనా వచ్చినందున షాపునకు సంబంధించిన రికార్డులను స్థానిక వ్యవసాయ అధికారికి అప్పగించారు.
రావులపాలెంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు