తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్రపాలిత యానాంలో విజిలెన్స్ సహా అవినీతి నిరోధక శాఖ సంయుక్తంగా క్యాంపు నిర్వహించింది. ప్రభుత్వాధికారులు, ఉద్యోగులు అవినీతికి పాల్పడినట్లు గుర్తించిన కేసులకు సంబంధించి ఇప్పటివరకు సుమారు 700 కిలోమీటర్ల దూరాన ఉన్న పుదుచ్చేరిలోనే విచారణలు జరిగేవని క్యాంప్ నిర్వహణాధికారి, పుదుచ్చేరి సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఆకాంక్ష యాదవ్ తెలిపారు.
సర్కార్ గుర్తించింది..
ఫలితంగా ఫిర్యాదుదారులు.. బాధితుల వ్యయ ప్రయాసలను ప్రభుత్వం గుర్తించిందని ఆమె పేర్కొన్నారు. రీజియన్ల వారీగా క్యాంపులు నిర్వహించి కేసుల పరిష్కారానికి కృషి చేస్తున్నామని వెల్లడించారు.