ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్రమంగా రేషన్‌ బియ్యం తరలింపు... ఎనిమిది మంది అరెస్ట్

తూర్పుగోదావరి జిల్లాలో రేషన్‌ బియ్యం విక్రయాలపై విజిలెన్స్‌, పౌరసరఫరాల అధికారులు దాడులు చేశారు. ఈ ఘటనలో ఎనిమిది మంది వ్యక్తులపై కేసు నమోదు చేసి...వారి నుంచి 5 లక్షల విలువైన 13వేల 392 కిలోల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

raid on  ration rice sales
అక్రమంగా రేషన్‌ బియ్యన్ని తరలిస్తున్న ఎనిమిది మంది అరెస్ట్...

By

Published : Nov 6, 2020, 8:57 AM IST

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో రేషన్‌ బియ్యం కొనుగొళ్లు, అమ్మకాలు జరుపుతున్నట్లు సమాచారం రావడంతో... దాడులు నిర్వహించినట్లు అమలాపురం డివిజన్‌ పౌరసరఫరాల అధికారి ఆనందబాబు, విజిలెన్స్‌ డీఎస్పీ ముత్యాలనాయుడులు తెలిపారు. ఈ దాడుల్లో రావులపాలెం, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన అయిదురు వ్యక్తులు... ద్విచక్ర వాహనాలపై రేషన్‌ బియ్యం తీసుకుని వస్తుండగా పట్టుకున్నట్లు అధికారులు చెప్పారు.

అలాగే అదే ప్రాంతంలోని ఓ రేకుల షెడ్డులో ఉన్న 29 బస్తాలు, వ్యాన్‌లో ఉన్న 217 బస్తాలు, అయిదుగురు వ్యక్తులు తీసుకుని వచ్చిన... 22 బస్తాల బియ్యాన్ని, వాహనాలను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. బియ్యం కొనుగోలు చేస్తున్న కర్రి రామిరెడ్డితో పాటు బియ్యం అమ్ముతున్న అయిదుగురు, స్థల యాజమాని, వ్యాన్‌ డ్రైవర్‌లపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details