తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో స్థానిక వైకాపా నాయకుడి అనుచరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఓ కేసులో వరప్రసాద్ అనే ఎస్సీ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇసుక లారీలు అడ్డుకున్నందుకు మునికూడలి వద్ద స్థానిక వైకాపా నాయకుడు కవల కృష్ణమూర్తి కారుతో వచ్చి ఢీకొట్టినట్లు బాధితుడు ఆరోపించాడు. పోలీస్‌స్టేషన్‌లో తనను విచక్షణారహితంగా కొట్టి జుట్టు, మీసాలు తీసేశారని.. చంపేస్తారని బాధితుడు వాపోయాడు.
మెుహంపై ఎస్సై షూతో తన్నాడు.. నన్ను చంపేస్తారేమో: వరప్రసాద్
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీసులు ఓ ఎస్సీ యువకుడిని అరెస్టు చేసి... శిరోముండనం చేయించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వివాదాస్పదం అయింది. సీతానగరం సమీపంలో ఇసుక లారీలు అడ్డగోలుగా తిరుగుతున్నాయని.. దానిని ప్రశ్నించినందుకే తనపై దాడి చేశారని బాధితుడు వరప్రసాద్ వాపోయాడు. పోలీసుల తీరుపై ఎస్సీ, ఎస్టీ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
victim varaprasad about police station incident
వైకాపా నాయకుడి అనుచరుడి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి తన కుమారున్ని సీతానగరం పీఎస్‌కు పోలీసులు తీసుకువెళ్లారని అతని తల్లి చెబుతుంది. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి చూసేసరికి తన బిడ్డ అపస్మారక స్థితిలో ఉన్నాడని... ఆవేదన వ్యక్తం చేసింది.
ఇదీ చదవండి: పోలీస్ స్టేషన్లోనే ఎస్సీ యువకుడికి గుండు గీసిన పోలీసులు
Last Updated : Jul 21, 2020, 8:00 PM IST