నేడు రాజమహేంద్రవరానికి ఉపరాష్ట్రపతి - vice president venkaia naidu in rajamahendra varam tour
ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఇవాళ రాజమహేంద్రవరంలో పర్యటించనున్నారు. వెంకటేశ్వరనగర్‌లో నూతనంగా నిర్మించిన డెల్టా ఆసుపత్రిని ప్రారంభించనున్నారు.
![నేడు రాజమహేంద్రవరానికి ఉపరాష్ట్రపతి vice president venkaia naidu in rajamahendra varam tour](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5494684-1087-5494684-1577322654544.jpg)
ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఇవాళ రాజమహేంద్రవరానికి రానున్నారు. నగరంలోని వెంకటేశ్వరనగర్‌లో నూతనంగా నిర్మించిన డెల్టా ఆసుపత్రి ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు. అనంతరం 12.10 గంటలకు రహదారులు, భవనాల శాఖ అతిథి గృహానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 3.50 గంటలకు రోడ్డు మార్గంలో విమానాశ్రయానికి వెళ్తారు. అక్కడి నుంచి సాయంత్రం 5.30 గంటలకు విజయవాడ చేరుకోనున్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడి పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆయన ప్రయాణించే మార్గాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఈ మేరకు ఏర్పాట్లపై బుధవారం అర్బన్ ఎస్పీ షిమోషీ బాజ్‌పాయ్, ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ రఘువీరారెడ్డి, సబ్‌కలెక్టర్ డాక్టర్.ఆర్.మహేష్‌కుమార్, ఇతర ఉన్నతాధికారులు సమీక్షించారు. విమానాశ్రయం వద్ద కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఉప రాష్ట్రపతి ప్రయాణించే మార్గంలో ఇప్పటికే రెండు, మూడు దఫాలు కాన్వాయ్ ట్రయల్‌రన్ నిర్వహించారు.