ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వేటకు సిద్ధమవుతున్న మత్స్యకారులు - fisher men

తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలో చేపలు పట్టేందుకు మత్స్యకారులు తయారవుతున్నారు. సుమారు 61రోజుల చేపలవేట నిషేధం అనంతరం ఈరోజు అర్ధరాత్రి వేటకు వెళ్లనున్నారు.

చేపల వేట

By

Published : Jun 14, 2019, 8:38 PM IST

వేటకు సిద్ధమవుతున్న మత్స్యకారులు

తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని తాళ్ళరేవు, ఐ.పోలవరం, కాట్రేనికోన మండలాలకు చెందిన సుమారు 20 వేల మత్స్యకార కుటుంబాలు చేపలవేటకు సిద్ధమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో 61 రోజులుగా ఇంటికే పరిమితమయ్యారు. నేటితో గడువు ముగియనుండటంతో అర్ధరాత్రి నుండి వేటకు వెళ్లనున్నారు. నియోజవర్గంలో సుమారు 60 మరబోట్లు, 500 వరకు ఇంజిన్ నావలు..సముద్రంలో, గోదావరి నదీ జలాల్లో వేటకు వెళ్తుంటాయి. నిషేధ సమయంలో ప్రభుత్వం మత్స్యకారుల కుటుంబాలకు ఇస్తానన్న 4500 రూపాయల పరిహారాన్ని నిషేధిత సమయం పూర్తయినా... ఇంతవరకు అందించిన దాఖలాలు లేవని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details