తూర్పు గోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలంలోని తీరప్రాంత గ్రామాల్లో సముద్రకోత ప్రభావం ఏ విధంగా ఉందో ఈ చిత్రాలు చూస్తే అర్థమవుతుంది. అలల ఉద్ధృతికి ఇక్కడి ఊళ్లు కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఏడేళ్ల కిందట సూరాడపేటలో వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించారు.
ఇది రెండు నెలల క్రితం వరకు సముద్రానికి వంద మీటర్ల దూరంలో ఉండేది. గుడి ముందు రోడ్డు, కొన్ని ఇళ్లు ఉండేవి. గత నెల చివరి వారంలో ఏర్పడిన వాయుగుండం సమయంలో తీరం భారీగా కోతకు గురై రోడ్డు, ఇళ్లు దెబ్బతిన్నాయి. అలల తాకిడి కొనసాగడంతో బుధవారం నాటికి ఆలయం కూడా ఇలా పూర్తిగా కుప్పకూలింది.