తూర్పుగోదావరి జిల్లా వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతుండడంతో ఆలయ ప్రాంగణం మంత్రోచ్ఛరణలతో మార్మోగింది. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఏడు శనివారాల నోము నోచుకునే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో దర్శన క్యూలైన్లు నిండిపోయాయి. కరోనా వైరస్ కారణంగా భక్తులు భౌతిక దూరం పాటించాలని, జాగ్రత్తలు తీసుకోవాలని దేవాదాయశాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.
వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ
తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహోత్సవాలు జరుగుతున్నాయి. కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన ఈ గుడి ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది.
వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం