అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రథం దగ్ధం మానవ తప్పిదమా? ఎవరైనా కావాలని చేశారా? అనే కోణంలో విచారణ జరుగుతోందని మంత్రి వెల్లంపల్లి అన్నారు. ఆలయ ఈవోను బదిలీ చేశామని.. సిబ్బందిపైనా చర్యలుంటాయని తెలిపారు.
అంతర్వేది రథం దగ్ధం ఘటన: ఆలయ ఈవో బదిలీ: వెల్లంపల్లి
అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధం బాధాకరమని మంత్రి వెల్లంపల్లి అన్నారు. ఆలయ ఈవోను బదిలీ చేశామని.. సిబ్బందిపైనా చర్యలు ఉంటాయని మంత్రి తెలిపారు.
vellampalli on anthrvedhi srilakshmi narasimhaswamy chariot
ఫిబ్రవరిలోగా రూ.95 లక్షలతో అంతర్వేది రథం నిర్మాణం జరిగేలా ఆదేశించామని వెల్లడించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రతి ఆలయంలో సీసీ కెమెరాల ఏర్పాటు చేస్తామన్నారు. రాజకీయ కోణంలో కావాలని కొన్ని పార్టీలు విమర్శలు చేస్తున్నాయని మంత్రి వెల్లంపల్లి అన్నారు.
ఇదీ చదవండి:2020 చివరికి ప్రతి ఐదుగురిలో ఒకరికి కరోనా!