ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రజలకు చెప్పాల్సిన అధికారే... ఉల్లంఘిస్తున్నాడు!' - వేలంక వీర్వో మసాజ్ న్యూస్

ఆ వీఆర్వో ఏకంగా సచివాలయ కేంద్రాన్నే మసాజ్ కేంద్రంగా మార్చేశాడు...! అక్కడే విధుల్లో మహిళా వాలంటీర్స్​ ఉన్నా... ఏమీ పట్టనట్లు అతడి కంటే వయస్సులో పెద్దవాడైన వ్యక్తితో మసాజ్ చేయించుకుంటూ సేద తీరుతున్నాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా వేలంక గ్రామంలో జరిగింది.

vro massage in govt office in velanka
వేలంక వీర్వో మసాజ్

By

Published : May 22, 2020, 12:23 PM IST

భౌతిక దూరం పాటించాలంటూ ప్రభుత్వం చెబుతున్నా... అవేమీ ఈ ప్రభుత్వ అధికారికి చెవికెక్కటం లేదు. విధి నిర్వహణ సమయంలో... అందునా సచివాలయ కేంద్రంలో మసాజ్ చేయించుకుంటున్నాడు. ప్రస్తుతం ఆ దృశ్యాలు బయటికి పొక్కటంతో విమర్శలు పాలవుతున్నాడు. అతడే తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం వేలంక గ్రామానికి చెందిన వీఆర్వో భాస్కర్​రావు. ఆ సమయంలో మహిళా వాలంటీర్లు అక్కడే ఉన్నారు. భౌతిక దూరం పాటించాలని ప్రజలకు చెప్పాల్సిన అధికారే... ఈ విధంగా చేయటంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాన్ని మసాజ్​ కేంద్రంగా మార్చటంతో విమర్శలపాలవతున్నాడీ వీఆర్వో.

ABOUT THE AUTHOR

...view details