లాక్డౌన్ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు 100 రూపాయలకే 5 రకాల పండ్ల కిట్, 7 రకాల కూరగాయల కిట్ పంపిణీ కార్యక్రమం జిల్లాలో ప్రారంభమయ్యింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి పినిపే విశ్వరూప్ ప్రారంభించారు. ఉద్యానవన శాఖ, మార్కెటింగ్ శాఖ, మెప్మా సంయుక్త ఆధ్వర్యంలో రోజుకు 1000 కుటుంబాలకు ఈ కిట్లు అందించే కార్యక్రమం చేపడుతున్నామనీ, భవిష్యత్తులో 10 వేల కుటుంబాలకు అందించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు జేసీ లక్ష్మీషా వివరించారు.
లాక్డౌన్: 100 రూపాయలకే 5 రకాల పండ్లు - తక్కువ ధరకే పండ్లు కూరగాయల కిట్లు
వంద రూపాయలకు 5 రకాల పండ్లు, మరో వంద రూపాయలు ఖర్చు చేస్తే 7 రకాల కూరగాయలు ఉండే కిట్లు మీ సొంతం కానున్నాయి. అంటే వంద రూపాయలకు 5 రకాల పండ్లు, 7 రకాల కూరగాయలు అన్నమాట. ఇదంతా ఎక్కడో కాదు తూర్పుగోదావరి జిల్లాలోనే.
![లాక్డౌన్: 100 రూపాయలకే 5 రకాల పండ్లు fruits vegetables kits distribution in east godavari](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6926842-29-6926842-1587739309803.jpg)
రెండు వందలకు 5 రకాల పండ్లు... 7 రకాల కూరగాయల కిట్లు