కూరగాయల ధరలు పెరగడంతో సామాన్య మధ్యతరగతి కుటుంబాలు విలవిల్లాడుతున్నాయి. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో వచ్చిన గోదావరి వరదలు లంక భూముల్లోని కూరగాయల పంటలను ముంచెత్తాయి. ఈ కారణంగా కూరగాయల ఉత్పత్తి తగ్గిపోయింది.
ముంచెత్తిన వరదలు.. కొండెక్కిన కూరగాయల ధరలు - తూర్పు గోదావరి జిల్లాలో కూరగాయల ధర పెరుగుదల
తూర్పుగోదావరి జిల్లాలోల కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. లంక గ్రామాల్లో వరదలు ముంచెత్తడంతో.. కూరగాయల తోటలకు నాశనమయ్యాయి. దీంతో కూరగాయాల దిగుబడి తగ్గిపోయింది.
జిల్లాలోని అవసరాలకు లంక భూముల్లో పండే కూరగాయలు ఎంతో అందుబాటులో ఉంటాయి. స్థానికంగా లంక భూముల్లో కూరగాయలు పడినప్పుడు ధరలు అందుబాటులో ఉంటాయి. అయితే గోదావరి వరదల కారణంగా జిల్లాలో 50 లంక గ్రామాల్లో ఈ పంటలు ముంపు బారిన పడి కుళ్ళి పోయాయి. 15 రోజుల వ్యవధిలో కూరగాయల ధరలు కిలో 40 నుంచి 50 శాతానికి పెరిగాయి 15 రోజుల క్రితం కిలో బెండకాయలు 20 రూపాయలు లభిస్తే ఇప్పుడు 60 రూపాయల ధర పలుకుతోంది. వంకాయలు కిలో 40 నుంచి 60 రూపాయలు ఇలా ధరల్లో పెరుగుదల వచ్చింది.
ఇదీ చదవండి: నేర్పాలంటే... నేర్చుకోవాల్సిందే!