యానాంలో స్వచ్ఛంద సేవా సంస్థలు పేదల కడుపు నింపుతున్నాయి. దాతల సహకారంతో సమకూర్చిన 20 లక్షల రూపాయల విలువైన కూరగాయలను పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఐదు రకాల కూరగాయలు 5 కేజీల చొప్పున 16 వేల కుటుంబాలకు అందజేశారు. గ్రామాల్లోని స్వచ్ఛంద సేవా సంస్థ కార్యకర్తలు ఉదయాన్నే తలుపు తట్టి మరీ కూరగాయలు అందించారు. ప్రజలు ఎవరూ బయటకు రావాల్సిన అవసరం లేకపోవటంతో అక్కడి మార్కెట్లో జన సంచారం తగ్గింది.
16 వేల కుటుంబాలకు కూరగాయల పంపిణీ - యానాం వార్తలు
లాక్డౌన్తో ఉపాధి లేక చాలా పొట్ట నింపుకోవడానికి చాలామంది పేదలు ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి వారికి కొన్ని స్వచ్ఛంద సంస్థలు, దాతలు ఆపన్నహస్తం ఇస్తున్నారు. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని యానాంలో సుమారు 20 లక్షల రూపాయల విలువైన కూరగాయలను ఉచితంగా పంపిణీ చేశారు. వేల కుటుంబాలకు ఇంటివద్దకు వెళ్లి వీటిని పంపిణీ చేశారు.
vegetables