ఆదివాసీల ప్రథమ పౌరుడు వాల్మీకి మహర్షి అని రంపచోడవరం మాజీ ఎంపీపీ సత్యనారాయణ రెడ్డి అన్నారు. వాల్మీకి జయంతిని పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం మండలం పెద గెడ్డాడ గ్రామంలో వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సత్యనారాయణ రెడ్డితో పాటు ఆదివాసీ పెద్దలు మనోజ్, తదితరులు పాల్గొన్నారు.
తూర్పు మన్యంలో ఘనంగా వాల్మీకి జయంతి ఉత్సవాలు - రంపచోడవరం మండలం పెద గెడ్డాడలో వాల్మీకి జయంతి వేడుకలు
తూర్పు మన్యంలో వాల్మీకి జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. రంపచోడవరం మండలం పెద గెడ్డాడ గ్రామంలో వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
![తూర్పు మన్యంలో ఘనంగా వాల్మీకి జయంతి ఉత్సవాలు Valmiki Jayanthi celebrations](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9383906-118-9383906-1604158250218.jpg)
తూర్పు మన్యంలో ఘనంగా వాల్మీకి జయంతి ఉత్సవాలు