తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలోని ఏముందివరం గ్రామం నుంచి వాకలగరువు గ్రామం వరకు.. వైనతేయ ఎడమ ఏటిగట్టు రహదారికి అధికారులు మరమ్మతులు చేపట్టారు. శిథిలావస్థకు చేరుకున్న వైనతేయ ఎడమ ఏటిగట్టు రహదారి మరమ్మతులకి 18 లక్షల రూపాయల నిధులు మంజారు చేశారు. ఈ రహదారి దెబ్బతిని పుష్కరకాలం కావస్తున్నప్పటికీ.. మరమ్మతులకు నోచుకోలేదు. ఇప్పుడు రహదారి పనులు చేపట్టటం.. వివిధ గ్రామాల ప్రజలకు ఎంత ఉపయుక్తంగా ఉంది. దీనిపై పలు గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
ఏటిగట్టు రహదారికి మరమ్మతులు ప్రారంభం - road repair latest news update
పుష్కర కాలంగా మరమ్మతులకు నోచుకోని.. రహదారి అభివృద్ధికి అధికారులు చర్యలు చేపట్టారు. 18 లక్షల రూపాయలతో పనులు చేపట్టారు. దీంతో తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లోని ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.
![ఏటిగట్టు రహదారికి మరమ్మతులు ప్రారంభం మరమ్మతులు చేపట్టిన రోడ్డు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11:48:02:1621232282-ap-rjy-21-17-floodbank-repair-pgannavaram-ap10020-17052021112426-1705f-1621230866-234.jpg)
మరమ్మతులు చేపట్టిన రోడ్డు
ఇవీ చూడండి…:రూ.5 కోట్ల విలువైన ఉపాధి హామీ పనులు మంజూరు