కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వేంకటేశ్వర స్వామి, కొత్తపేట మండలం మందపల్లిలోని శనీశ్వర స్వామి వారి ఆలయాలను కడిగారు. సంప్రోక్షణ పూజలు చేసి ఆలయ అర్చకులు గర్భాలయం తలుపులు తెరిచారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తెరుచుకున్న వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయం - సూర్యగ్రహణం
సూర్యగ్రహణం ముగియడంతో ఆలయాల అర్చకులు సంప్రోక్షణ పూజలు నిర్వహించి తలుపులు తెరిచారు. తూర్పుగోదావరి జిల్లా వాడపల్లి వేంకటేశ్వర స్వామి, శనీశ్వర స్వామి వారి ఆలయాలలో పూజలు నిర్వహించారు.
![తెరుచుకున్న వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయం vadapalli venkateswaraswamy temple was opened after the solar eclipse](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7711259-621-7711259-1592740070984.jpg)
వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం