కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనాలు నిబంధనలు పాటిస్తూ పున:ప్రారంభించారు. కరోనా వైరస్ కేసులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. గత ఐదు రోజుల నుంచి ఆలయంలో దేవాదాయ శాఖ అధికారులు భక్తులకు దర్శనం నిలిపివేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, నిబంధనలు పాటిస్తూ.. ఉదయం 10 గంటల వరకు మాత్రమే దర్శనాలకు అనుమతిచ్చారు. ఆలయాన్ని ఎప్పటికప్పుడు శానిటేషన్ చేస్తూ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. శనివారం రోజున అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో ఆ రోజున పూర్తిగా దర్శనాలు నిలిపివేస్తున్నారు.
వాడపల్లి వెంకటేశ్వరస్వామి దర్శనాలు పునఃప్రారంభం - తూర్పుగోదావరి జిల్లా వార్తలు
కొవిడ్ కారణంగా నిలిపేసిన వాడపల్లి వెంకటేశ్వరస్వామి దర్శనాలను తిరిగి పునరుద్ధరించారు. నిబంధనలు పాటిస్తూ..ఉదయం 10గంటల వరకు మాత్రమే అనుమతినిచ్చారు.
Vadapalli Venkateswaraswamy Temple