ఆత్రేయపురం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ధనుర్మాసం, ఏడు శనివారాల నోము సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణతో మార్మోగిపోయింది. క్యూలైన్లు నిండిపోవడంతో స్వామి దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. ఆలయానికి వచ్చిన వారికి ఇబ్బంది లేకుండా దేవాదాయశాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.