తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఆలయ ప్రాంగణంలోకి స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు శ్రీవారికి అష్టోత్తర శత కలశాభిషేకం కార్యక్రమాన్ని ఘనంగా చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు పంచామృత అభిషేకాలు నిర్వహించారు.
వాడపల్లి వేంకటేశ్వర స్వామికి అష్టోత్తర శత కలశాభిషేకం - వాడపల్లి వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వేద పండితులు స్వామివారికి అష్టోత్తర శత కలశాభిషేకం కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.
![వాడపల్లి వేంకటేశ్వర స్వామికి అష్టోత్తర శత కలశాభిషేకం Vadapalli Venkateswara Swamy Brahmotsavalu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9510995-479-9510995-1605090033805.jpg)
వాడపల్లి వేంకటేశ్వర స్వామికి అష్టోత్తర శత కలశాభిషేకం
వాడపల్లి వేంకటేశ్వర స్వామికి అష్టోత్తర శత కలశాభిషేకం