కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివెరిసింది. ఓ వైపు ధనుర్మాసం, మరో వైపు ఏడు శనివారాల నోము నోచుకునే భక్తుల గోవింద నామ స్మరణలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. భక్తులు అధిక సంఖ్యలో రావటంతో క్యూలైన్లు, ఆలయ ఆవరణం కిక్కిరిసిపోయింది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
గోవింద నామస్మరణతో మారుమోగిన వాడపల్లి - వాడపల్లి వెంకటేశ్వర స్వామి తాజా వార్తలు
ధనుర్మాసం సందర్భంగా వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.
vadapalli venkateswar swamy