వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో శ్రీ నమ్మాళ్వార్ తిరునక్షత్ర మహోత్సవాలు ఘనంగా ప్రారంభించారు. కరోనా నేపథ్యంలో భక్తులు ఎవరికీ అనుమతి లేకుండా ఏకాంతంగా ఈ ఉత్సవాలను నిర్వహించారు. ఐదు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయని ముదునూరి సత్యనారాయణ రాజు తెలిపారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ఆలయ ప్రాంగణంలోకి పల్లకిపై ఊరేగింపుగా తీసుకువచ్చి వేదపండితులు కల్యాణం నిర్వహించారు.
ఏకాంతంగా వాడపల్లి వెంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం - కోనసీమ తీరుపతి న్యూస్
కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి కల్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. కరోనా కారణంగా ఏకాంత ఉత్సవాలు నిర్వహించారు.
vadapalli venkateshwaraswamy kalyana utsavam