ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఘనంగా వాడపల్లి వెంకటేశ్వరస్వామి పవిత్రోత్సవాలు - east godavari district

కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

వాడపల్లిలో ఘనంగా వెంకటేశ్వర స్వామి పవిత్రోత్సవాలు

By

Published : Aug 10, 2019, 11:59 PM IST

వాడపల్లిలో ఘనంగా వెంకటేశ్వర స్వామి పవిత్రోత్సవాలు

తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం వాడపల్లిలోని వెంకటేశ్వర స్వామి పవిత్రోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ఏడాది పొడవునా నిర్వహించే కైంకర్యాలు, ఉత్సవాల్లో తెలిసి తెలియక నెలకొనే దోషాల నివారణకు ఉత్సవాలు నిర్వహించడం, ఆనవాయితీగా వస్తుందని వేదపండితులు తెలిపారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, ఆలయ ప్రదక్షణ, పూర్ణాహుతి తదితర పూజా కార్యక్రమాలను ఆలయంలో ఏర్పాటు చేశారు. 12వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు, ఈ మూడు రోజులపాటు ఆలయంలో కళ్యాణాలు, అష్టోత్తర పూజలు రద్దు చేసినట్లు ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. రాజమహేంద్రవరానికి చెందిన వేదనపత్తి సతీష్ కుమార్ కామాక్షి దంపతులు 2 లక్షల 50 వేల విలువైన 9 వెండి బిందెలను... రావులపాలంకి చెందిన వీర్రెడ్డి కుటుంబ సభ్యులు లక్షా 40 వేల విలువైన బంగారు ఆభరణాలను స్వామివారికి బహుకరించారు.

ABOUT THE AUTHOR

...view details