తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు.వేల సంఖ్యలో భక్తులు తరలిరావటంతో క్యూలెన్లు నిండిపోయాయి.ప్రదక్షిణలు చేసే భక్తులు ఇబ్బంది పడ్డారు.స్వామి దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది.భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.శనివారం సెలవు రోజు కావడంతో భక్తుల రద్దీ పెరిగినట్లు అధికార్లు వెల్లడించారు.
భక్తులతో కిక్కిరిసిన వాడపల్లి క్షేత్రం - aatreyapuram
కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లిలోని వెంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
వాడపల్లి క్షేత్రం