భక్తజన వరదుడు, చందన స్వరూపుడైన వేంకటేశ్వరస్వామి కృపాకటాక్షాల కోసం వివిధ ప్రాంతాల నుంచి ఏడువారాల నోము ఆచరించే భక్తులు వేలాదిమంది శనివారం వాడపల్లి తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం, క్యూలైన్లు భక్తులతో కిక్కిరిశాయి. స్వామివారి పుష్పాలంకరణ ఆకట్టుకుంది. వచ్చిన భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. వేకువజామున 3 గంటల నుంచి ప్రారంభమైన దర్శనాలు రాత్రి 10 వరకు కొనసాగాయి. ఉచిత దర్శనాల క్యూలైన్లలో ఉన్న ఎండ వేడిమికి ఒకింత ఇబ్బంది పడ్డారు. స్వామిని 32 వేల మంది భక్తులు దర్శనం చేసుకోగా, దర్శనాలు, ప్రసాదాల అమ్మకాలు తదితర వాటి ద్వారా రూ.8 లక్షల ఆదాయం వచ్చింది. ఏర్పాట్లను దేవస్థానం పాలక మండలి ఛైర్మన్ రమేష్‌రాజు పర్యవేక్షించారు.
వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు.. - తూర్పుగోదావరి జిల్లా వాడపల్లి దేవాలయం
కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని శనివారం ఒక్కరోజే 32వేల మంది భక్తులు దర్శించుకున్నారు. ఆ ఒక్క రోజే రూ. 8 లక్షల ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు.
vadapalli temple