కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు పందిరి రాట మహోత్సవం జరిగింది. నవంబర్ 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను దేవాదాయ శాఖ అధికారులు నిర్వహించనున్నారు.
వాడపల్లి ఆలయంలో ఘనంగా పందిరి రాట మహోత్సవం - వాడపల్లి వెంకటేశ్వర ఆలయం తాజా వార్తలు
వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు పందిరి రాట మహోత్సవం ఘనంగా నిర్వహించారు. వేదపండితులు ప్రత్యేక పూజలు జరిపారు.
vadapalli temple
ఈ బ్రహ్మోత్సవాలకు పందిరి రాట కార్యక్రమాన్ని ఆలయ ప్రాంగణంలో వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి చేపట్టారు. ఆలయ కమిటీ ఛైర్మన్ రమేష్ రాజు, కార్యనిర్వహణ అధికారి ముదునూరి సత్యనారాయణ రాజులు పాల్గొని స్వామివారికి పూజలు చేశారు.
ఇదీ చదవండి:పోలవరం ప్రాజెక్టు డ్యామ్ నిర్మాణానికి మాత్రమే నిధులిస్తాం: కేంద్రం
TAGGED:
తూర్పుగోదావరి జిల్లా వార్తలు