ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఘనంగా వాడపల్లి వెంకటేశ్వరస్వామి పవిత్రోత్సవాలు - వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయం

కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వరస్వామి వారి పవిత్రోత్సవాలు ఘనంగా జరిగాయి. స్వామివారికి హోమం, తిరుమంజననాదులు వైభవంగా జరిపారు.

vaadapalli venkateswara swamy temple in east godavari district
ఘనంగా వాడపల్లి వెంకటేశ్వరస్వామి పవిత్రోత్సవాలు

By

Published : Aug 30, 2020, 12:43 AM IST

కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వరస్వామి వారి పవిత్రోత్సవాలు ఘనంగా జరిగాయి. స్వామికి పట్టు పవిత్రాల సమర్పణ కార్యక్రమాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ఆలయ మండపంలో పండితులు ఖండవిల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో శ్రీదేవి, భూదేవి, సమేత శ్రీమలయప్ప స్వామివారికి హోమం, తిరుమంజననాదులు వైభవంగా జరిపారు. స్వామివారికి విష్వక్షేనపూజ, విశేషన్నపన, మహాశాంతి హోమం నిర్వహించి.. ప్రతిష్ఠ చేసిన పట్టు పవిత్రాలను స్వామివారికి అలంకరించారు.

ABOUT THE AUTHOR

...view details