నదిలో.. 80 మీటర్ల లోతులో బోటు? - ఉత్తరాఖండ్ రాష్ట్ర విపత్తుల సాంకేతిక బృందం కనుగొంది
గోదవరిలో మునిగిన బోటు జాడను ఉత్తరాఖండ్ రాష్ట్ర విపత్తుల సాంకేతిక బృందం గుర్తించింది. సోనార్ సిస్టమ్ ద్వారా 70 నుంచి 80 మీటర్ల లోతులో బోటు ఉన్నట్లు తేల్చింది.
![నదిలో.. 80 మీటర్ల లోతులో బోటు?](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4478226-177-4478226-1568800443624.jpg)
దొరికిన బోటు జాడ...
తూర్పుగోదావరి జిల్లా పాపికొండల్లో మునిగిన బోటు జాడ దొరికింది. సోనార్ సిస్టమ్ ద్వారా 70 - 80 మీటర్ల లోతులో బోటు ఉన్నట్లు గుర్తించారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర విపత్తుల సాంకేతిక బృందం ఈ దిశగా చేసిన ప్రయత్నం సఫలమైందని ఆ రాష్ట్ర ఇన్‌స్పెక్టర్ జితేంద్రజోషి వెల్లడిచారు. అక్కడి నుంచి బోటును బయటికి తీయడమెలా అన్న విషయంపైనే అధికారులు దృష్టి పెడుతున్నారు. మరోవైపు.. బోటులో ఇంకా మృతదేహాలు ఏమైనా ఉంటే వాటినీ జాగ్రత్తగా వెలికి తీసేందుకు అవసరమైన చర్యలపై సహాయబృందాలు కసరత్తు చేస్తున్నాయి.