తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం మండలంలో విద్యా వనరుల కేంద్రం వద్ద యూటీఎఫ్ నాయకులు ధర్నా చేపట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి జగన్... కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ప్రస్తుత విద్యా సంవత్సరం వృథా కాకుండా చూడాలని కోరారు. విద్యను అందించే ప్రత్యామ్నాయ మార్గాలను అమలు చేయాలని తెలిపారు.
సీపీఎస్ రద్దు కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా - p gannavaram latest news
ఎన్నికల సమయంలో సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని పి గన్నవరం యూటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక విద్యావనరుల కేంద్రం వద్ద ధర్నాకు దిగారు.
పి గన్నవరం యూటీఎఫ్ నాయకుల ధర్నా