రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనున్న ఇళ్ల స్థలాలు నివాసానికి పనికి రావంటూ.. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉప్పలపాడు మహిళలు నిరసనకు దిగారు. మండలంలోని ఉప్పలపాడు, మల్లేపల్లి, గండేపల్లి గ్రామాల్లో ఇళ్లస్థలాలను.. పోలవరం కాలువపై ఇస్తున్నారని ఆరోపించారు. అక్కడి భూమి నివాసానికి పనికిరాదని పలుమార్లు చెప్పినా పట్టించుకోలేదని లబ్ధిదారులు పేర్కొన్నారు. మరోచోట స్థలాలను తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
'నివాసయోగ్యం కాని ఇళ్ల స్థలాలు మాకొద్దు' - ఇళ్ల స్థలాల విషయమై ఉప్పలపాడు మహిళల నిరసనలు
పలుమార్లు చెప్పినా వినకుండా నివాసయోగ్యం కాని స్థలాలను తమకు ఇస్తున్నారంటూ.. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం ఉప్పలపాడు మహిళలు ఆందోళన చేపట్టారు. మరోచోట తమకు స్థలాలు కేటాయించాలని నినాదాలు చేశారు.
నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలు