'సగం రోజులకే వేతనాలు చెల్లిస్తున్నారు' - upadhi hami kulela dharna news in east godavari district
తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలం ములగపూడి గ్రామంలో ఉపాధి హామీ కూలీలు ప్రధాన రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. పనిదినాలలో సగం రోజులకే వేతనాలు చెల్లిస్తున్నారని, మిగిలి రోజులకు అధికారులు సమాధానం చెప్పడం లేదంటూ రోడ్డుపై బైఠాయించారు. తమకు పూర్తి రోజులు పని కల్పించాలని, పూర్తి స్థాయిలో వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
ములగపూడిలో నిరసన వ్యక్తం చేస్తున్న ఉపాధి హామీ కూలీలు