తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం గోపాలపురం.. వశిష్ఠ గోదావరి వంతెన వద్దకు గుర్తుతెలియని మృతదేహం కొట్టుకొచ్చింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడికి సుమారు 40 సంవత్సరాల వయస్సు ఉంటుందని... చాతిపై నవ్య, కుడి చేతిపై శ్రీదేవి అని పచ్చబొట్టు ఉందని.. ముదురు నీలం రంగు టీషర్ట్, బూడిద రంగు జీన్స్ ప్యాంట్ వేసుకున్నాడని పోలీసులు తెలిపారు. వీఆర్వో విశ్వనాథ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
వశిష్ఠగోదావరి వంతెన వద్ద గుర్తుతెలియని మృతదేహం లభ్యం - east godavari district updates
తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం.. వశిష్ఠ గోదావరి వంతెన వద్దకు గుర్తుతెలియని మృతదేహం కొట్టుకొచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుడికి 40 ఏళ్ల వయస్సు ఉంటుందని పోలీసులు తెలిపారు.

గోపాలపురం వశిష్ఠ గోదావరి వంతెన వద్ద గుర్తు తెలియని మృతదేహం