ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తూర్పుగోదావరి జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం - కోరుకొండలో ఎన్టీఆర్ విగ్రహన్ని కూల్చిన ఘటన తాజా సమాచారం

తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం దోసకాయలపల్లిలో గుర్తు తెలియని వ్యక్తులు ఎన్టీఆర్ విగ్రహాన్ని కూల్చివేశారు. ఘటనాస్థలిని డీఎస్​పీ వెంకటేశ్వరరావుతో పాటు మాజీ మంత్రి జవహర్, మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ చేరుకొని పరిశీలిస్తున్నారు. విగ్రహాలు ధ్వంసం చేసిన వైకాపా గ్యాంగ్ ఇప్పుడు మహనీయుల విగ్రహాలపై పడిందని తెదేపా నేత నారా లోకేశ్ విమర్శించారు.

NTR statue
తూర్పు గోదావరిలో ఎన్టీఆర్ విగ్రహన్ని ధ్వంసం చేసిన దుండగులు

By

Published : Feb 5, 2021, 3:11 PM IST

Updated : Feb 5, 2021, 3:23 PM IST

తూర్పు గోదావరి జిల్లా దోసకాయలపల్లిలో గుర్తు తెలియని దుండగులు ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. డీఎస్​పీ వెంకటేశ్వరరావుతో పాటు మాజీ మంత్రి జవహర్​, మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రశాంత వాతావరణం నెలకొన్న రాజానగరం నియోజకవర్గంలో ఇలాంటి సంఘటన జరగటం బాధాకరమని జవహర్​ అన్నారు. దోషులును అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దేవాలయాలపై దాడులు జరిగినా.. అధికార పార్టీ స్పందించలేదని విమర్శించారు. నేడు ప్రజలు ఎంతో గౌరవించే ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసినవారిని పట్టించుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

ఈ ఘటనను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు. "మూర్ఖత్వానికి మానవ రూపం జగన్ రెడ్డి. మహనీయుల విగ్రహాలు కూలుస్తూ మరింత దిగజారిపోయారు. దేవతా విగ్రహాలు ధ్వంసం చేసిన వైకాపా గ్యాంగ్ ఇప్పుడు మహనీయుల విగ్రహాలపై పడింది" అని లోకేశ్ అన్నారు. విగ్రహం పడగొడితే చెరిగిపోయే చరిత్ర కాదు నందమూరి తారకరామారావుది అని వ్యాఖ్యానించారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వైకాపా గ్యాంగ్​ని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇదీ చదవండీ..'విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ'పై.. కార్మికుల ఆందోళన

Last Updated : Feb 5, 2021, 3:23 PM IST

ABOUT THE AUTHOR

...view details