'2021 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తవుతుంది'
'2021 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తవుతుంది' - పోలవరం
పోలవరం ప్రాజెక్టు 2021 డిసెంబర్ వరకు పూర్తవుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2020 ఫిబ్రవరి చివరినాటికి 69 శాతం పనులు పూర్తయ్యాయని వివరించింది. తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు... కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రతన్‌లాల్ కటారియా రాతపూర్వక సమాధానం ఇచ్చారు. పోలవరం నిర్వాసితుల్లో 3వేల 922 కుటుంబాలకు పునరావాసం కల్పించినట్టు వివరించారు. ప్రాజెక్టు నిర్మాణంలో లక్షా 5 వేల 601 కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉందని శివసేన ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి రాతపూర్వక సమాధానం ఇచ్చారు.

'2021 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తవుతుంది'