తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలంలో ఓ ఆటోను గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టారు. మంటల తీవ్రతకు ఆటో పూర్తిగా దగ్ధమైంది. గోపాలపురానికి చెందిన బర్రె చందర్రావు.. తన ఆటోను శుక్రవారం రాత్రి ఇంటి సమీపంలో పార్కింగ్ చేశాడు. అర్థరాత్రి సమయంలో కొంతమంది వ్యక్తులు ఆ వాహనానికి నిప్పంటించారు. ఈ ఘటనలో.. బాధితునికి సుమారు రెండు లక్షల రూపాయల నష్టం వాటిల్లింది.
ఆటోకు నిప్పు పెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు - తూర్పుగోదావరి జిల్లా తాజా వార్తలు
తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో గుర్తు తెలియని వ్యక్తులు ఓ ఆటోకు నిప్పుపెట్టారు. బాధితునికి సుమారు రెండు లక్షల నష్టం వాటిల్లింది.
పూర్తిగా దగ్దమైన ఆటో