తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు పోలీస్ స్టేషన్ పక్కన కుడుపూడి సత్యనారాయణ అనే రైతుకు చెందిన గేదె పెయ్య దూడను గుర్తు తెలియని జంతువు చంపింది. ఈ మండలంలోని నెల రోజుల కిందట జొన్నాడ, పెనికేరు తదితర ప్రాంతాల్లో లేగదూడలు ఈ విధంగానే మృత్యువాత పడ్డాయి. కపిలేశ్వరం మండలం అంగర గ్రామంలో ఇటీవల దూడలపై దాడి చేస్తున్న తోడేలును పట్టుకుని రైతులు హతమార్చారు. ఆలమూరు పశుసంవర్ధక శాఖ ఏడి రామకృష్ణ పరిశీలించి అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. మరిన్ని దూడలను కోల్పొక ముందే సమస్య పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.
దూడలపై గుర్తు తెలియని జంతువు దాడి - దూడల పై గుర్తు తెలియని జంతువు దాడి
లేగదూడలపై గుర్తు తెలియని జంతువు దాడి చేసి చంపుతున్న సంఘటన తూర్పు గోదావరి జిల్లా ఆలమూరులో చోటు చేసుకుంది.
దూడల పై గుర్తు తెలియని జంతువు దాడి