తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో గంటి పెదపూడి గ్రామం నుంచి పి గన్నవరం వరకు ఎనిమిది కిలోమీటర్ల మేర రాష్ట్ర రహదారి అధ్వానంగా మారింది. రెండు సంవత్సరాలుగా రోడ్డు అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఈ కారణంగా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.
నిధులున్నా రహదారి అభివృద్ధి శూన్యం! - East godavari District news
తూర్పుగోదావరి జిల్లాలోని గంటి పెదపూడి గ్రామం నుంచి పి.గన్నవరం వరకు వెళ్లే ఎనిమిది కిలోమీటర్ల రహదారి అధ్వానంగా తయారైంది. నిధులు విడుదలైనా రోడ్డు అభివృద్ధికి నోచుకోకపోవటంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
![నిధులున్నా రహదారి అభివృద్ధి శూన్యం! undeveloped road](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-01:40:52:1619597452-ap-rjy-23-28-damageroad-fundsavailable-noresponse-publictrouble-pgannavaram-ap10020-28042021114048-2804f-1619590248-458.jpg)
undeveloped road
గంటి పెదపూడి నుంచి పి గన్నవరం వరకు ఈ రహదారిని అభివృద్ధి చేసేందుకు సెంట్రల్ రోడ్ ఫండ్స్ నిధులు 24.50 కోట్లు మంజూరై ఏడాది కావస్తోంది. ఇప్పటికి రెండు సార్లు టెండర్లు పిలిచారు. అయినా గుత్తేదారులు ముందుకు రాలేదని రహదారులు భవనాల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సిహెచ్ సత్య వేణు తెలిపారు. కనీసం గోతులు అయినా పూడ్చాలని ప్రజలు మొరపెట్టుకున్నారు. సమస్య పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.